"ఆదిపురుష్" లో ఆ పాత్రలోనే కనిపించనున్న ప్రభాస్ .... రావణుడిగా అతనే ! కంబినేషనలో - TeluguCircle-Trending News

Breaking

18 August 2020

"ఆదిపురుష్" లో ఆ పాత్రలోనే కనిపించనున్న ప్రభాస్ .... రావణుడిగా అతనే ! కంబినేషనలో



 రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), ఓం రావత్(OM RAUT) క్రేజీ కంబినేషనలో భారీ బడ్జెట్ తో  చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్రీ డి లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్  ' ఆది పురుష్ '(AdiPurush) పోస్టర్ ను ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేసాడు.ఈ పోస్టర్ లో రాముడు, రావణాసుడు, హనుమంతుడు పాత్రలు ద్వారా సినిమా జోనర్ ఇది అని తెలిసే విధంగా పోస్టర్ ను రూపొందించారు.  డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఎప్పుడా అని ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు  'ఆదిపురుష్ ' సినిమా ద్వారా నెరవేరబోతోంది. మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ ఈ సినిమాని హిందీ,తెలుగు భాషలో నిర్మించనున్న ఈ మూవీని మలయాళం, కన్నడ భాషలోకి అనువదించనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పౌరాణిక సినిమా ఇది. 

     మన భారతదేశ ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం సాకారం అవుతున్న తరుణంలో మరొక్కసారి రామాయణ ఇతిహాసాన్ని మూవీ స్క్రీన్ పై త్రీ డి లో చూడడానికి భారతీయులు ఎంతోగాను ఎదురు చూస్తున్నారు.  అయితే ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రం ఇంకా పూర్తికాలేదు. మరోవైపు 'మహానటి' డైరెక్టర్ నాగ అశ్విన్, అశ్వినీ దత్త్ నిర్మాణంలో 21 వ సినిమా గ చేస్తున్నట్టు ప్రకటించారు. 2022 ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

No comments: